ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం భక్తులు లేక వెలవెలబోయింది. ఆషాడ మాసం కావడం, వాన ముసురుకు భక్తుల రద్దీ తగ్గింది. క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాలుగైదు రోజుల నుంచి భక్తుల సందడి తగ్గడం వల్ల ఆలయ వీధులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రసాదాల కౌంటర్, కల్యాణకట్ట ఆలయ పరిసరాలు భక్తులు లేక బోసిపోయాయి. ఆలయ ఖజానాకు రోజు వారి వివిధ శాఖల నుంచి రూ. 4 లక్షల 43 వేల 589 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 2న శ్రావణ మాసం ప్రారంభం అవుతుండడం వల్ల భక్తుల రాక పెరగనుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి