ETV Bharat / state

నిబంధనలు పాటించని 7దుకాణాలకు జరిమానా విధింపు - yadagirigutta

యాదగిరిగుట్టలో మాంసం విక్రయాలు జరిపే మార్కెట్​ను యాదాద్రి మున్సిపల్​ కమిషనర్​ రజిత పరిశీలించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించిన 7 దుకాణాలపై జరిమానా విధించారు.

yadadri muncipal commissioner visit nonveg market
నిబంధనలు పాటించని 7దుకాణాలకు జరిమానా విధింపు
author img

By

Published : May 10, 2020, 10:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల చికెన్, మటన్ విక్రయాలు జరిపే మార్కెట్​లో యాదాద్రి మున్సిపల్ కమిషనర్ రజిత పరిశీలించారు. దుకాణదారులకు పలు సూచనలు చేశారు. కరోనా నిర్మూలనలో భాగంగా పరిశుభ్రత పాటించాలని, వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి దుకాణం ముందు శానిటైజర్ ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా లాక్​డౌన్ నిబంధనలు ఉల్లఘించిన 7 దుకాణాలపై జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని యాదాద్రి పురపాలక కమిషనర్ రజిత హెచ్చరించారు.

ఇవీ చూడండి: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.