యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు లేదంటే లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల్లోగా ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని యాడా వర్గాలు చెబుతున్నాయి. కట్టడాలతో పాటు సుందరీకరణ పనులన్నీ తుది దశకు చేరాయి.
ఇటీవల ప్రగతి భవన్‌లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో యాదాద్రి పనులపై చర్చించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి రెండు మూడు రోజుల్లో యాదాద్రికి వెళ్లనున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందో అంచనా వేయనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా గడువులోపు యాదాద్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
- ఇదీ చూడండి : మకర సంక్రమణ శోభ.. ఉత్తరాయణం ఆగమనం