యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం 10 రోజులహుండీ ఆదాయం రూ. 26,73,229ల నగదు రూపేణ జమైనట్లు దేవస్థానం ఈవో గీత తెలిపారు. అలాగే మిశ్రమ బంగారం 16 గ్రాములు, వెండి 850 గ్రాములు స్వామి వారి నిధికి సమకూరినట్లు వివరించారు.
లాక్డౌన్ కారణంగా.. హుండీ ఆదాయం భారీగా పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 8 నుంచి ఆలయం తిరిగి తెరచుకోనున్న నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా భక్తులు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా