యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గత కొన్ని రోజులుగా నీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో నీటి సమస్య లేదని మున్సిపాలిటీగా మారిననాటి నుంచి సమస్య తీవ్రమైందన్నారు. సమస్య పరిష్కారంపై ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: యువతను ఆకట్టుకుంటే మంచి ఫలితాలు