ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ అక్రమ సంబంధం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వారని.. నిన్న రాత్రి వీరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందన్నారు. ఇవాళ ఉదయం భర్త నిద్రలేచి చూసేసరికి భార్య రాజేశ్వరి వంట గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని కనిపించింది. కిందకి దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం రాజేశ్వరిని ఆమె భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: గోడ కూలి బాలుడు మృతి