యాదాద్రి జిల్లా రామన్నపేట సర్పంచ్ శిరీషా పృథ్వీరాజ్ వినూత్న రితీలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ లెక్కచేయకుండా, మాస్కులు లేకుండా తిరుగుతున్న ప్రజలకు గులాబీ, బంతిపూలు ఇచ్చి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలని వేడుకున్నారామె. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. మనం చేసే చిన్న తప్పిదం వల్లే.. వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
కరోనాపై అవగాహన కల్పించేందుకు కొద్ది రోజుల క్రితమే వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేసి అందరిని ఆలోచింపచేశారు. తనవంతు సాయంగా నిరుపేదలకు, గర్భిణీలకు నిత్యావసరాలు, పౌష్ఠికాహారం అందజేశారు.
![women sarpanch distributed flowers to people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6863126_sarpunch4.jpg)
![women sarpanch distributed flowers to people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6863126_sarpunch3.jpg)
![women sarpanch distributed flowers to people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6863126_sarpunch.jpg)
ఇదీ చదవండి: 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. !