యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో ఓ మద్యం దుకాణం నిర్వాహకులు.. లాక్‌డౌన్ సమయంలో మద్యంతో సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. అర్థరాత్రి షాపు తెరిచి ఆటోలో మద్యం తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిర్వాహకులను పట్టుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నందుకు నిర్వాహకులపై ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా ఎస్పీ కృష్ణప్రియ తెలిపారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక