యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారు జామున వర్షం కురిసింది. ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోట కొండూరు మండల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బొమ్మలరామారం మండల కేంద్రంలో చిరు జల్లులు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం పడటం వల్ల రైతులు సాగుకు సిద్ధ మవుతున్నారు. ఎండల వల్ల ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వరుణుడు కరుణించడం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న కర్షకులు.. తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. భారీ ఎత్తున ఈదురుగాలులు వీయడం వల్ల పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఇదీ చూడండి: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఈటల