ETV Bharat / state

దత్తత గ్రామాల ప్రజా ప్రతినిధులతో.. జిల్లా కలెక్టర్​ సమావేశం! - Wanaparthy Collector Meeting With Leaders About Sera Organisation

గ్రామీణ ప్రాంతాలను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధిని సాధించే దిశగా సహకరిస్తామని  అమెరికాకు చెందిన సెరా ఆర్గనైజేషన్స్​ వారు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​లో నాలుగు డివిజన్లు దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వారు తెలిపారు. వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్​ బాషా వారితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

Wanaparthy Collector Meeting With Leaders About Sera Organisation
దత్తత గ్రామాల ప్రజా ప్రతినిధులతో.. జిల్లా కలెక్టర్​ సమావేశం!
author img

By

Published : Aug 28, 2020, 10:03 AM IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పది గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన సెరా ఆర్గనైజేషన్స్​ వారు ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటగా సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలను దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని నాలుగు డివిజన్లను సైతం దత్తత తీసుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్​ యాస్మిన్​ బాషాతో పలు శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు స్వయం సాధికారత సాధించేందుకు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇందుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్..
గ్రీన్ రెవల్యూషన్ ఛాలెంజ్​లో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లాలోని ప్రతి ఒక్కరు గ్రీన్ రెవల్యూషన్ ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ దిశగా రాష్ట్ర నడుస్తోందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.