ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి వేడుకలకు సిద్ధమవుతోంది. భక్తులకు శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఉదయం 6.43 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా యాత్రికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
6రోజుల పాటు అధ్యయనోత్సవాలు
ఆలయంలో శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ వెల్లడించారు. ఈ ఆరు రోజుల్లో నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలు తాత్కాలికంగా రద్దు పరిచినట్లు ప్రకటించారు. ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్య ఆరాధనలు చేపడతామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కన్నులపండువగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం