యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మ వారికి కన్నుల పండువగా ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్ఠింపజేశారు. వివిధ రకాల పూలు, తులసీ దళాలతో, మంగళ హారతులు, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి : విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు