ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో అమ్మవారికి ఊంజల్​ సేవ - యాదాద్రి భువనగిరి జిల్లా లేటెస్ట్​ వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్​ సేవ నిర్వహించారు. సుమారు ఒక గంట పాటు ఈ ఉత్సవం కొనసాగింది.

unjal seva to andal ammavaru in yadadri bhuvanagiri district
యాదాద్రి ఆలయంలో అమ్మవారికి ఊంజల్​ సేవ
author img

By

Published : Jan 8, 2021, 10:08 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్​ సేవ నిర్వహించారు. వేకువజామున స్వామి అమ్మవార్లను ఆరాధిస్తూ హారతి నివేదన జరిగింది. నిత్యపూజలతో పాటు సాంప్రదాయ పూజల నిర్వహించారు. స్వామి వారి గర్భాలయంలో స్వయంభువులకు ఆస్థాన పరంగా పూజలు చేపట్టిన పూజారులు.. బాలాలయంలో ఆర్జిత పూజలను చేశారు.

ఉత్సవమూర్తులకు పాలాభిషేకం, తులసి అర్చన చేశారు. అర్చకులు ఆలయంలో స్వామి వారికి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం చేపట్టారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారి ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్ సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి నివేదించారు. సుమారు ఒక గంట పాటు ఈ ఉత్సవం కొనసాగింది.

ఇదీ చదవండి: క్లూ ఇచ్చిన కాగితం... ఆ మహిళదే మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.