యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పిన స్వామి, అమ్మవార్లను ఆరాధిస్తూ హారతి నివేదించారు. నిత్య పూజలతో పాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు ఆస్థాన పూజలు, బాలాలయంలో ఆర్జిత సేవలను చేపట్టారు. ఉత్సవమూర్తులకు పాలాభిషేకం, తులసి అర్చన అనంతరం స్వర్ణ పుష్పాలతో అలంకరించారు.
స్వామి సన్నిధిలో నిత్యకల్యాణం, నారసింహ హోమం చేపట్టారు. సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవా చేపట్టారు. కొవిడ్ దృష్ట్యా నిరాడంబరంగా ముత్యాల పల్లకి పై అలంకృత మైన అమ్మవారిని ఆరాధిస్తూ హారతి నివేదించారు. శుక్రవారం వచ్చిన ఆదాయం. రూ.1,76,868 అని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వివాహం, శుభకార్యాలపై రెండో దశ కరోనా ప్రభావం