జ్యోతిర్లింగాల్లో అమర్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఎంత గొప్పగా భావిస్తామో.. ఆ మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోవాలన్న అంతే కష్టతరం. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో యాత్ర వీలుకాని తరుణంలో యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన ఇద్దరు బాలికలు.. ఇంట్లోనే మంచు శివలింగాన్ని తయారు చేశారు. ఈ హిమలింగేశ్వర విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఏనిమిదో తరగతి చదుతున్న అక్షయ, ఆమె చెల్లలు హర్షశ్రీతో కలసి తయారు చేసిన ఈ మంచు శివలింగాన్ని చూడటానికి ఇరుగుపొరుగు వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గతేడాది జూన్ మాసంలో కూడా హిమలింగేశ్వర విగ్రహాన్ని తయారు చేసినట్లు చిన్నారులు గుర్తు చేశారు.
ఇదీ చదవండి: చనిపోయిన యజమాని ఫొటో చూస్తూ విలపిస్తున్న శునకం