ETV Bharat / state

రోడ్డు పనులకు మూడేళ్లు

తెలంగాణ ప్రభుత్వం మిర్యాలగూడ-సూర్యాపేట మధ్యలో ఉన్న భీమారం-సూర్యాపేట ప్రధాన రహదారిని విస్తరణ పనులను ప్రారంభించింది. 07.07.2016న మంత్రి జగదీశ్‌రెడ్డి శిలాఫలకం వేశారు. మొత్తం 32 కి.మీ. విస్తరించాల్సిన ఈ రహదారి పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి.

author img

By

Published : Jul 7, 2019, 10:53 AM IST

Updated : Jul 7, 2019, 12:28 PM IST

మిర్యాలగూడ, వేములపల్లి, సూర్యాపేట, కేతేపల్లి మండలాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు మొత్తం కంకర తేలి ద్విచక్ర వాహనాల వారు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి లేచి కళ్లలో పడుతుండగా ప్రయాణికులు అనారోగ్యం పాలవుతున్నారు. రాత్రివేళలో ప్రయాణించాలంటే మరిన్ని ఇబ్బందులు తప్పడంలేదు. పొలాలకు వెళ్లలేకపోతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ts-yadadribhuvanagiri-road-contract-issue
రోడ్డు పనులకు మూడేళ్లు

నిధులు మంజూరు చేస్తే
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే 15 రోజుల వ్యవధిలో నిర్మాణ పనుల్ని పూర్తి చేయిస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సింహా పేర్కొన్నారు. గుత్తేదారుకు రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వగా ఇప్పటికి 60 శాతానికి పైగా పనులు పూర్తిచేశారు. నిధుల సమస్యతో మిగతా పనులు నిలిపివేశారు.

నిధుల కేటాయింపు
శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి నుంచి భీమారం వరకు 28 కి.మీ. విస్తరించాల్సి ఉంది. మొదటి దశలో భీమారం నుంచి మొల్కపట్నం వరకు 20 కి.మీ.కు రూ.35 కోట్లు కేటాయించారు. రెండో దశలో మొల్కపట్నం నుంచి శెట్టిపాలెం వరకు 8 కి.మీ. రూ.8.20 కోట్లు కేటాయించారు.

జరిగిన పనులు
భీమారం నుంచి మొల్కపట్నం వరకు రహదారిని రెండు వైపులా విస్తరించారు. రెండు వైపులా మట్టిపోసి రహదారిని చదును చేయటమే కాకుండా ... కంకర పోసి మొదటి పొరను ఏర్పాటు చేశారు. మొల్కపట్నం నుంచి శెట్టిపాలెం వరకు రెండు వైపులా విస్తరణ పనులు కొంత మేరకు జరిపి నిలిపివేశారు.

అసలు సమస్య ఏమిటి
రూ.43.20 కోట్ల నిధుల్లో కేవలం రూ.4 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఏడాదిన్నర కిందట రూ.6 కోట్లకు ప్రతిపాదనలు పంపినా రాలేదు. గుత్తేదారు పనుల్ని చేయలేక నిలిపివేశారు. అధికారులు కూడా గుత్తేదారుపై ఒత్తిడి చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఇదీ చూడండి : నేటితో ముగియనున్న 34వ సెయిలింగ్ పోటీలు

Last Updated : Jul 7, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.