యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చోక్ల తండాలో వరి కంది పంటలను శిక్షణ సహాయ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ పరిధిలో సాగు చేసిన విత్తనోత్పత్తి పంటల తీరును గమనించారు. వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను సందర్శించారు. విత్తన ఉత్పత్తి పథకం ద్వారా చేకూరే, ప్రయోజనాలను వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు, రైతు బీమా, లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
అప్రమత్తంగా ఉండాలి...
ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. బొమ్మల రామారం మండలం, పెద్ద పర్వతాపురం, మర్యాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక, పెద్ద పర్వతాపూర్ గ్రామంలో వరి పొలాలను గరిమా సందర్శించారు. ఆమె వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : సంతోష్ కుమార్ విత్తన గణపతి సవాల్ స్వీకరించిన రంజిత్ రెడ్డి