Traffic jam on National Highway: నల్లగొండ జిల్లాలోని చిట్యాల వద్ద జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చౌటుప్పల్‌లో కేటీఆర్ రోడ్ షో కారణంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాయి. ఈ మార్గం గుండా వెళ్లే వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి వైపుగా ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. చిట్యాల నుంచి భువనగిరి వెళ్లే వాహనాలు కూడా భారీగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. చిట్యాల నుంచి చౌటుప్పల్‌కు బస్సులో వెళ్లే విద్యార్థులు వాహనాల దారి మళ్లించడంతో తమ గ్రామాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చదవండి: