నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ కబ్జాలు ఉండవనీ, ఈ చట్టం రైతుల, ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తుందనీ భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. కొత్త చట్టాన్ని స్వాగతిస్తూ తెరాస పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని జయ లక్ష్మీ యశోద గార్డెన్ నుంచి రైతులతో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్ర పటానికి.. ఎమ్మెల్యే, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
బైపాస్ మీదుగా రాయగిరి వరకు, తిరిగి భువనగిరి చౌరస్తా వద్ద రైతులతో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. కొత్త చట్టాన్ని తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.
అప్పటికప్పుడు పాస్బుక్లు:
అప్పటికప్పుడు రైతులకు పాస్బుక్లు ఈ కొత్త చట్టం ద్వారా అందుతాయనీ, ఈ చట్టంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన్నందుకు అంత సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.
నియోజకవర్గంలోని భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల నుంచి వందలాది మంది రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉద్ధృతంగా కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక