ETV Bharat / state

కేసీఆర్​కు ప్రజాభద్రతపై శ్రద్ధ లేదు: కోదండరాం

author img

By

Published : Aug 28, 2020, 4:09 PM IST

రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తామని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.

tjs-party-district-office-opened-at-bhuvanagiri-yadadri-district
ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తాం: కోదండరాం

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజాభద్రత విషయంలో లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేసీఆర్​ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని... మంత్రులు, అధికారులు ఉత్సవ విగ్రహలేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.7500 భృతి చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎన్నికల గురించి పార్టీలో చర్చించే పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్న దళిత అమ్మాయికి న్యాయం జరగాలని, ఆమెకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.