మరో వారం రోజుల్లో యాదాద్రి ఆలయ సందర్శనకు తెర లేవనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ శనివారం సాయంత్రం తీసుకున్న నిర్ణయంతో పాటు, ప్రార్థన మందిరాలు తెరచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలకు వీలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు అందగానే నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడతామని ఆలయ ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు.
గదులు అద్దెకిచ్చే విధానం రద్దు
ఏదేమైనా తిరిగి 79వ రోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనులవిందు గొల్పనున్నారు. ఉదయం 5గంటల తర్వాత ఆలయ కైంకర్యాలు మొదలై.. రాత్రి 9 గంటల్లోపు ముగియనున్నాయి. దర్శనాలు కొనసాగించనున్నారు. అయితే గదులు అద్దెకిచ్చే విధానాన్ని మరికొన్నాళ్ల వరకు మూసి ఉంచే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా