ETV Bharat / state

cm kcr yadadri visit: 17వసారి యాదాద్రికి సీఎం కేసీఆర్​.. - యాదాద్రిలో సీఎం పర్యటన

cm kcr yadadri visit: సీఎం కేసీఆర్​ నేడు 17వసారి యాదాద్రిలో పర్యటించనున్నారు. నారసింహుని సన్నిధి పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన వివిధ పనులను పరిశీలిస్తారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.

yadadri
yadadri
author img

By

Published : Feb 7, 2022, 5:28 AM IST

cm kcr yadadri visit: యాదాద్రి నారసింహుని దివ్యాలయ ఉద్ఘాటనకు రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్​ పనుల పరిశీలనకు వస్తున్నారు. 2014 అక్టోబర్ 17న సీఎంగా తొలిసారిగా కేసీఆర్​ వచ్చారు. అప్పటి నుంచి 16 సార్లు యాదాద్రిని సందర్శించారు. నేడు 17వసారి సీఎం కేసీఆర్​ నారసింహుని సన్నిధికి వస్తున్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి పనులను పరిశీలించనున్నారు.

yadadri
యాదాద్రి క్షేత్రం

యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా.. చేపట్టిన వివిధ పనులు తుదిరూపునకు వచ్చాయి. ప్రధాన రాజగోపురాలు, జీయర్ స్వామి నేతృత్వంలో స్వర్ణ కలశాల స్థాపనకు పరంజాను ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైకు చెందిన నిపుణులతో ఏర్పాటవుతున్న ఈ పరంజా పటిష్టతను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఇటీవలే పరిశీలించారు.

ఆలయంలో పసిడి వర్ణంలో ఉన్న క్యూలైన్లు బిగింపు పూర్తి కావొచ్చింది. లైటింగ్​ పనులు పూర్తిచేసి ట్రయన్​ రన్​ నిర్వహిస్తున్నారు. కొండపైన ఉత్తరదిశలో రక్షణగోడ, బస్​బే, స్వాగతతోరణ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని యాడా చెబుతోంది. రెండో కనుమదారి అనుసంధాన నిర్మాణం తుది దశకు చేరింది. పుణ్య స్నానాల కోసం లక్ష్మి పుష్కరిణి, కల్యాణకట్ట, తలనీలాల సమర్పణకు కల్యాణకట్ట నిర్మాణాలు పూర్తయ్యాయి. నేటి పర్యటనలో తుది దశకుచేరిన పనులను కేసీఆర్​ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. కొండ కింద సేకరించిన 75 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తారు.

ఇదీచూడండి: నేడు యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.