ETV Bharat / state

విద్యార్థుల బాధ చూడలేక.. టీవీ కొనిచ్చిన టీచర్​.. - yadadri news

టీవీ లేక పోవడంతో ఆన్ లైన్ క్లాసులు వినలేకపోతున్న విద్యార్థులకు ఓ టీచర్ అండగా నిలిచారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసుల కోసం టీవీ కొనిచ్చి తన మంచి మనస్సు చాటారు.

online classes in telangana government schools

author img

By

Published : Sep 25, 2020, 7:49 PM IST

కరోనా దెబ్బకు మూతబడ్డ పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీవీల ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆన్ లైన్ తరగతులు చూస్తున్నరా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అనేక మంది పేద విద్యార్థులు తమ నివాసాల్లో టీవీలు లేక ఆన్ లైన్లో బోధించే పాఠాలను వినలేకపోతున్నారు.

కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు చేతనైనంత సాయం చేసి వారు ఆన్ లైన్ క్లాసులు వినేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అంజలి తన పెద్దమనస్సు చాటారు. టెలివిజన్ లేక ఇబ్బంది క్లాసులు వినలేక పోతున్న విద్యార్థులకు టీవీని అందించి అండగా నిలిచారు. గ్రామంలో నిరుపేద విద్యార్థులకు స్మార్ట్​ ఫోన్​ లేకపోవడంతో పక్కింటికి వెళ్లి... వింటున్నట్లుగా గమనించారు.

అది చూసి బాధనిపించి... ఆ విద్యార్థులకు అంజలి.. ఓ టీవీని ఇప్పించింది. దీనితో ఆ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్​, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.