ETV Bharat / state

ఆలయ వ్యాపారుల సంఘం రాష్ట్రాధ్యక్షుడిగా తడక వెంకటేశ్​

author img

By

Published : Jul 19, 2020, 10:39 PM IST

యాదగిరిగుట్టలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల వ్యాపారస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తడక వెంకటేశ్​ ప్రమాణ స్వీకారం చేశారు.

Tadaka Venkatesh is the state president of the Temple Merchants Association
దేవాలయాల వ్యాపారస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తడక వెంకటేశ్​

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్​హాల్​లో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల వ్యాపారస్తుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షుడిగా తడక వెంకటేశ్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి ఆలయ ఈవో గీతా రెడ్డి, ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు దేవాలయాల వద్ద గల దుకాణదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

దేవాలయ వ్యవస్థలో వ్యాపారస్తులు ఒక భాగమని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.. యాదాద్రి దేవస్థానంలో వ్యాపారస్తులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ ప్రకారం దుకాణాలు కేటాయిస్తామన్నారు. లాక్​డౌన్​ కారణంగా దేవాలయాల వద్ద ఉండే దుకాణదారులు ఆర్థికంగా చాలా నష్టపోయాలని దేవాలయాల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు తడక వెంకటేశ్​ అన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.

ఇవీ చూడండి: ఆషాఢం చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు చుద్దామా.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.