ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా పీడ విరగడకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి గార్డెన్స్‌లో అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం చేపడుతున్నట్లు అఖండనామ ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 17 నుంచి మే 14 వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యాదాద్రి గుట్టలో భక్తులతో కలసి యజ్ఞ కరపత్రాలను ప్రభూజీ ఆవిష్కరించారు. ఇరవై ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందమంది స్వామీజీలు, సాధువులకు ఆహ్వానం పంపించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రచ్చ యాదగిరి, కోకల రవీందర్, అరె స్వామి, శ్రీనివాస్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భాగ్యనగర దారుల్లో చిమ్మ చీకట్లు.. వెలగని దీపాలు