ETV Bharat / state

మోత్కూరు అభివృద్ధికి సహకరించాలి : ఆయిల్​ఫెడ్​ ఛైర్మన్​

మోత్కూరు మున్సిపాలిటీ ప్రధాన రహదారి విస్తరణపై ఏం చేయాలనే అంశంపై మోత్కూరు వ్యాపార సంఘాలతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఆయిల్​ ఫెడ్​ ఛైర్మన్​ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రధాన రహదారి విస్తరణకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజల విజ్ఞప్తి మేరకు 80 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ చేపట్టడానికి ఎమ్మెల్యే సహకరించాలన్నారు.

state oilfed chairman ramakrishna reddy spoke on mothkur muncipalicty development
మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలి: రాష్ట్ర ఆయిల్​ఫెడ్​ ఛైర్మన్​
author img

By

Published : Jul 19, 2020, 6:17 PM IST

మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని రాష్ట్ర ఆయిల్​ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మోత్కూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రధాన రహదారిని విస్తరించేందుకు నిర్ణయించారు. ప్రధాన రహదారిని 70 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించేందుకు నిర్ణయించగా.. మూడు రోజుల క్రితం మున్సిపాలిటీలోని వ్యాపారులు, ప్రజలు ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ను కలిసి రోడ్డు విస్తరణను కుదించాలని వినతి పత్రం అందించారు.

ప్రధాన రహదారి విస్తరణపై ఏం చేయాలనే అంశంపై మోత్కూరు వ్యాపార సంఘాలతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఆయిల్​ఫెడ్​ ఛైర్మన్​ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని వారి అభిప్రాయాలు సేకరించారు. ఏనాటికైనా మున్సిపాలిటీ చట్టం ప్రకారం ప్రధాన రహదారి వంద అడుగుల ఉండాల్సిందేనని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులు, ప్రజల విజ్ఞప్తి మేరకు 80 అడుగుల వెడల్పుతో చేపట్టడానికి తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ అంగీకరించారని తెలిపారు. ఈ కుదింపులో ఎవరూ ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా రోడ్డు పరిధిలోని అదనపు నిర్మాణాలను తొలగించుకోవాలని, ఎలాంటి నిర్మాణం అయినా రోడ్డు మధ్యనుంచి 40 అడుగుల తర్వాతనే ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ సావిత్రి, వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, వర్తక సంఘం సభ్యులు సోమనరసయ్య, సోమ వెంకటేశ్వర్లు, మన్నే అంజయ్య, చందర్రావు, నిమ్మల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'కడుపు నింపే రైతు.. కడుపు రగిలి కాళ్లు పట్టుకున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.