Stabbing in Yadadri Collectorate Office : యాదాద్రి భువనగిరి జిల్లాలోని కలెక్టరేట్‌లో కత్తిపోటు కలకలం రేపింది. ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తున్న శిల్పకు.. 2012లో సుధీర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రెండు సంవత్సరాలుగా ఆమె భర్తతో దూరంగా ఉంటుంది. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈవో పని చేస్తున్న మనోజ్‌తో ఈ రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మనోజ్ రెండు నెలలుగా కార్యాలయానికి సెలవు పెట్టాడు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా.. అధికారులు మనోజ్‌కు ఎన్నికల విధులు వేయడంతో కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చాడు.
Women Attacked a Person in Yadadri Collector Office : అదే సమయంలో అక్కడ ఉన్న శిల్పకు- మనోజ్‌కు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మనోజ్‌పై శిల్ప కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని శిల్పను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Father Kill Daughter in Khammam : మరో ఘటనలో ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుమార్తె, అల్లుడిపై గడ్డపారతో దాడి(Father Attack with a shovel) చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాడిపూడి గ్రామానికి చెందిన రాములు.. అదే గ్రామానికి చెందిన అల్లుడు రామకృష్ణ, కుమార్తె ఉషపై శుక్రవారం ఉదయం దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉష (28) ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అల్లుడు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాములు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.