యాదాద్రి భువనగిరి జిల్లా.. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ అనితా రామచంద్రన్.. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిలతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొలువుల భర్తీపై మాటల యుద్ధం.. వేడెక్కిన పట్టభద్రుల పోరు