ETV Bharat / state

'ఊపిరి ఆడకపోవడం వల్లే శ్రావణి చనిపోయింది'

భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో శ్రావణి ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయిందని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్​ కోట్యానాయక్​ అన్నారు. పూర్తి వివరాలు ఫోరెన్సిక్​ నివేదికలో తెలుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

శ్రావణి హత్యకేసు
author img

By

Published : Apr 27, 2019, 7:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్​లో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే శ్రావణి చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​ కోట్యానాయక్​ తెలిపారు. శరీరం లోపల ఎడమ భాగాన పక్కటెముకలు విరిగినట్లు గుర్తించామన్నారు. పూర్తి వివరాలు ఫోరెన్సిక్​ నివేదిక అందిన అనంతరం తెలుస్తాయని అన్నారు.

ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం

శ్రావణి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించారని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో బొమ్మలరామారం ఎస్సై వెంకటేశ్వర్లును కమిషనరేట్​కు అటాచ్​ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

ఊపిరి ఆడకపోవడం వల్లే శ్రావణి చనిపోయింది

ఇదీ చదవండి : అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు

Intro:TG_NLG_63_27_SRAAVANIDEATH_DCP_DOCTOR_BYTES_AB_C14

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి కేసులో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో లో పోస్ట్ మార్టం చేసి మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరెంటెండెంట్ కోట్యా నాయక్ మీడియా తో మాట్లాడుతూ శ్రావణి మృతదేహం పై పెద్దగా గాయాలు లేవన్నారు. శరీరం లోపల మాత్రం ఎడమభాగాన 4 పక్కటెముకలు విరిగాయని గుర్తించామన్నారు.కుడి భాగం లో కమిలిన గాయాలు ఉన్నాయన్నారు. ఊపిరితిత్తులు, గుండె భాగంలో ఊపిరిఆడక చనిపోయిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. శ్రావణి ఎలా చనిపోయిందో పూర్తిగా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తెలుస్తుందన్నారు. ప్రాథమికంగా అమ్మాయి ఊపిరి ఆడక చనిపోయిందని డాక్టర్ కో ట్యా నాయక్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి నారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రావణి కేసులో నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. షీ టీం అడిషనల్ డీసీపీ సలీ మా బేగం, ఎస్ ఓ టి స్పెషల్ ఆపరేషన్ టీం సురేందర్ రెడ్డి, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మంజుల, భువనగిరి ఏసీపీ భుజంగ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టామన్నారు. వీరితో పాటు స్థానిక పోలీసులు కూడా విస్తృతంగా నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా డిసిపి నారాయణరెడ్డి వెల్లదించారు. ఈ కేసు దర్యాప్తు లో అలసత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కున్న బొమ్మలరామారం ఎస్ ఐ వెంకటేశ్వర్లు ను కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని డిసిపి నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Body:బైట్ : కోట్యా నాయక్ ( సూపరింటెండెంట్, జిల్లా కేంద్ర ఆసుపత్రి , యాదాద్రి భువనగిరి జిల్లా )
బైట్ : నారాయణ రెడ్డి (డిసిపి, యాదాద్రి భువనగిరి జిల్లా )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.