ETV Bharat / state

యాదాద్రిలో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు - శ్రావణ శుక్రవారం రోజున స్వామికి ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం స్వామికి నిత్యకల్యాణం, సుదర్శన హోమం నిర్వహించగా.. సాయంత్రం ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నిర్వహించారు.

sravana friday special pooja at yadagirigutta temple
శ్రావణ శుక్రవారం రోజున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 8, 2020, 5:53 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలోని బాలాలయంలో శ్రావణ శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఆరాధనలు, శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. తెల్లవారుజామునే ఉత్సవమూర్తులను అభిషేకించి.. తులసి పత్రాలతో అర్చనలు జరిపారు. ఉదయం శ్రీ సుదర్శన నారసింహ హోమం, స్వామి వారి నిత్యకల్యాణం, ఆన్​లైన్​లో నమోదు చేసుకున్న భక్తులకు వారి గోత్రనామాలతో పరోక్ష పద్ధతి ద్వారా అర్చకులు పూజలు చేపట్టారు.

సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పూలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి.. తులసి దళాలతో పూజలు చేశారు. మొదట శ్రీ మన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు భౌతిక దూరం మాస్కులు ధరించి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.