లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులు లేకపోవడం వల్ల ఏకాంత సేవలో అలయ అర్చకులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి జన్మ నక్షత్ర పూజలు జరిపారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి, అమ్మ వార్లకు శత ఘటాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్బంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాటిలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగుతో... వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.
ఇదీ చూడండి: విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం