యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోటం గ్రామానికి చెందిన జెల్లా సంపూర్ణ(60)కు శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ అనే ఇద్దరు కుమారులు. ఇద్దరూ పెళ్లి చేసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. సంపూర్ణ భర్త 10ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి తనకున్న భూమి సాగు చేసుకుంటూ జీవితం వెల్లదీస్తోంది. సంపూర్ణ వద్ద ఉన్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు ఇవ్వాలని చితకబాది బలవంతంగా లాక్కున్నారు.
తనకు న్యాయం చేయాలని... పోలీసులకు, ఆర్డీవోకు సంపూర్ణ ఫిర్యాదు చేసింది. దీంతో రెచ్చిపోయిన కుమారులు... అధికారుల దగ్గరకు వెళ్తే చంపేస్తామని హెచ్చరించారు. ప్రాణభయంతో ఊరు విడిచి, యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకుంది. దీనిపై ఈనాడు-ఈటీవీ భారత్లో 'ఆస్తులే ముద్దు.. అమ్మ వద్దు' అనే పేరుతో కథనం ప్రచురించారు. స్పందించిన చౌటుప్పల్ పోలీసులు.. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం కింద కుమారులపై కేసు నమోదు చేశారు. సంపూర్ణను వంగపల్లిలోని అమ్మఒడి అనాథశ్రమంలో చేర్పించారు.
ఇదీ చూడండి: కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!