యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆరురోజుల పాటు అర్చకులు.. వేదమంత్రోచ్ఛారణలు, నిత్య హవనములు, వివిధ పారాయణాలు, శివ పంచాక్షరి జపాలు నిర్వహించారు.
ఆఖరి రోజైన ఇవాళ శివ బాలాలయంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపి ఉత్సవాలను ముగించారు. శివరాత్రి ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గూగుల్ సాయం కావాలా? 'మీనా'తో మాట్లాడాల్సిందే!