యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన సిరబోయిన బాలయ్య అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. తన గొర్రెల మేత కోసం కొమ్మలు కొడుతున్న సమయంలో అనుకోకుండా కరెంట్ తీగలు తగిలి ఈ దుర్ఘటన సంభవించింది.
బాలయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటిపెద్ద మృతితో అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపడతామని తెలిపారు.
ఇవీ చదవండి :లాక్డౌన్పై సీఎం సమీక్ష.. పటిష్ట అమలుకు ఆదేశం