యాదాద్రి భువనగిరి జిల్లా వర్కట్పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలను వలిగొండ పోలీసులు దత్తత తీసుకుంటున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలొనే చదివించాలని బడిబాట కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు పోలీసుల సహకారంతో కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ప్రతిభావంతులని, వారి బోధన ద్వారా పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారని ఏసీపీ సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'టిక్‌టాక్' చేస్తూ మెడలు విరగ్గొట్టుకొన్న యువకుడు