KTR Latest Tweet : వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని సర్కార్ వంచనతో మళ్లీ ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు పరిహారమా? పరిహాసమా? అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దానికి వివిధ వార్తా పత్రికల కథనాలను జోడించారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. నాలుగు లక్షల 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
నివేదిక నిజం కాదా?: పంట నష్టం అంచనాలను తలకిందులుగా ఎందుకు మార్చేశారని, ఏకంగా 3 లక్షల 35 వేల ఎకరాలు ఎలా ఎగిరిపోయాయని విమర్శించారు. 79 వేల 574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణమని కేటీఆర్ ఆరోపించారు. అపార నష్టంతో అల్లాడుతున్న రైతులను ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా, మానవత్వం ప్రదర్శించలేరా అని ప్రశ్నించారు. ఐదు లక్షల 20 వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదిక ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు ఇంత భారీ కోతలా అని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పరిహారమా...పరిహాసమా..?
— KTR (@KTRBRS) October 10, 2024
వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని...వంచనతో మళ్లీ ముంచిన సర్కారు !
లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే..వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం..!
4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు..వ్యవసాయ శాఖ ఇచ్చిన… pic.twitter.com/t5ZDvmOf4n
సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR
పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి రాళ్లు, ఇసుక మేటలు వేసిన పొలాలను బాగు చేసుకోవడానికి పదివేలు ఏమూలకూ సరిపోవన్న ఆయన అందులోనూ కుదింపులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. అన్నదాత ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి పరిహారం అందించాలని కోరారు. 'రుణమాఫీలో దగా జరిగింది, రైతుభరోసా జాడ పత్తా లేదన్న కేటీఆర్ వరదలు ముంచెత్తి నష్టాల్లో, కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవడం లేదు' అని ధ్వజమెత్తారు. అన్నదాతపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పూర్తిస్థాయిలో పంట నష్టం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ తరపున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేసేందుకు సిద్ధమని తెలిపారు.
కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి : కేటీఆర్
అది మా బలహీనత అనుకోవద్దు : రకుల్ ప్రీత్ సింగ్ - Rakul Preet Singh on Konda Comments