ETV Bharat / offbeat

పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ! - HOW TO MAKE INSTANT SOFT IDLI

మీరు ఇడ్లీ చేయాలనుకుంటున్నారా? కానీ పప్పు నానబెట్టడం మర్చిపోయారా? డోంట్​ వర్రీ. ఈ పద్ధతిలో చేస్తే పప్పుతో పనే లేకుండా మృదువైన ఇడ్లీలు నిమిషాల్లో రెడీ అవుతాయి.

How to Make Instant Soft Idli in Telugu
How to Make Instant Soft Idli in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 11:02 AM IST

How to Make Instant Soft Idli in Telugu : హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ అంటే చాలా మందికి ఇడ్లీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే టేస్ట్​తోపాటు తేలిగ్గా అరుగుతూ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో.. ఎక్కువ మంది దీనిని అల్పాహారంగా తింటుంటారు. అయితే.. వీటిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ టిఫిన్ కోసం మినప పప్పు నానబెట్టుకొని.. రుబ్బుకోవాలి. అందులోకి రవ్వ కలిపి పులియబెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీలు తయారు చేసుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్​ ఉంటుంది. అయితే.. ఈ ప్రాసెస్​ లేకుండా.. పప్పు నానబెట్టే అవసరమే లేకుండా కేవలం నిమిషాల్లో ఎంతో మృదువైన, రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. మరి ఆ విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • మందపాటి అటుకులు - 1 కప్పు
  • పుల్లటి పెరుగు - ఒకటిన్నర కప్పు
  • వంట సోడా - అర టీ స్పూన్​
  • బొంబాయి రవ్వ - 1 కప్పు
  • నీరు - తగినన్ని
  • ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ గిన్నెలోకి అటుకులు తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అవి మునిగే వరకు నీళ్లు పోసి ఓ 30 నిమిషాలు నాననివ్వాలి.
  • ఇప్పుడు మరో గిన్నెలోకి పుల్లటి పెరుగు, వంట సోడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలపాలి. బాగా విస్క్​ చేసిన తర్వాత ఓ 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల పెరుగు పొంగుతుంది.
  • ఇప్పుడు పొంగిన పెరుగులోకి బొంబాయి రవ్వ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • 30 నిమిషాల తర్వాత బాగా నానిన రవ్వ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత అంతకుముందు నానబెట్టుకున్న అటుకులను మిక్సీ జార్​లో వేసుకుని అర కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్​లాగా గ్రైండ్​ చేసుకోవాలి.

టిఫెన్ సెంటర్​ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది!

  • ఈ పేస్ట్​ను రవ్వ మిశ్రమంలో కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో అంత జారుగా కలుపుకోవాలి. ఇక్కడే ఓ ట్రిక్​ ఉంటుంది. రవ్వను, అటుకుల మిశ్రమాన్ని ఎంత ఎక్కువ సేపు కలిపితే ఇడ్లీలు అంత సాఫ్ట్​గా వస్తాయి.
  • ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి సరిపడా నీళ్లు పోసుకుని వాటిని మరిగించుకోవాలి.
  • ఈ లోపు ఇడ్లీ ప్లేట్​లు తీసుకుని వాటి మీద పల్చటి తెల్లని వస్త్రాన్ని తడిపి వేయాలి. ఇలా చేస్తే ఇడ్లీ చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి.
  • ఇప్పుడు ఆ క్లాత్​ మీద ప్రిపేర్​ చేసుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని వేసి క్లాత్​ను క్లోజ్​ చేయాలి.
  • ఇప్పుడు ఆ ప్లేట్​లను మరుగుతున్న ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి హై-ఫ్లేమ్​ మీద 5 నిమిషాలు, లో-ఫ్లేమ్​ మీద మరో 3 నిమిషాలు ఉంచి స్టవ్​ ఆఫ్​ చేయాలి. అయితే వెంటనే ఇడ్లీలు బయటికి తీయకుండా స్టవ్​ ఆఫ్​ చేసిన మూడు నిమిషాల తర్వాత తీసి సర్వ్​ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఇడ్లీలు మరింత సాఫ్ట్​గా ఉడుకుతాయి.
  • ఆ తర్వాత వాటిని తీసి ప్లేట్​లోకి సర్వ్​ చేసుకుని కారప్పొడి చల్లి పల్లీ చట్నీ, నెయ్యితో తింటే "నభూతో" అనాల్సిందే. అంత టేస్టీగా, పట్టుకుంటే విరిగిపోతాయేమో అనేంత మృదువుగా ఉంటాయి. ఓ సారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి..

ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది!

ఇంట్లోనే ఘుమఘుమలాడే "ఉడిపి​ సాంబార్"​ - ఇడ్లీ, వడల్లోకి సూపర్​ కాంబినేషన్​ - ఇలా చేసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.