ETV Bharat / state

Sarpanch rescued teacher: వాగులో పడిపోయిన టీచర్​.. కాపాడిన సర్పంచ్​ - Sarpanch rescued teacher fell in vaagu

Sarpanch rescued teacher: ఓ సర్పంచ్​ తన మానవత్వాన్ని చాటుకున్నారు. అదుపుతప్పి ద్విచక్రవాహనంతో సహా వాగులో పడిపోయిన ఉపాధ్యాయురాలిని ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

వాగులో పడిపోయిన టీచర్​.. కాపాడిన సర్పంచ్​

author img

By

Published : Aug 4, 2022, 11:29 AM IST

వాగులో పడిపోయిన టీచర్​.. కాపాడిన సర్పంచ్​

Sarpanch rescued teacher: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు-కొలనుపాక మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై నిర్మించిన కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్​ నుంచి బచ్చన్నపేటకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు కల్వర్టుపై స్కూటీ అదుపు తప్పడంతో కింద పడిపోయింది. నీటి ప్రవాహానికి ద్విచక్రవాహనంతో పాటు వాగులోకి కొట్టుకుపోయింది. సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది.

అదే సమయంలో అటుగా వెళ్తున్న బచ్చన్నపేట మండలం పరమడకేశాపూర్​ గ్రామ సర్పంచ్​ గిద్దెల రమేశ్​ ఉపాధ్యాయురాలిని గమనించాడు. స్థానికుల సహాయంతో వాగులోకి దిగి టీచర్​ను ఒడ్డుకు చేర్చాడు. సరైన సమయంలో స్పందించి.. ఉపాధ్యాయురాలి ప్రాణాలను కాపాడిన సర్పంచ్(sarpanch humanity)​ను స్థానికులు అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.