ETV Bharat / state

మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే సునీతకు సర్పంచ్ వినతిపత్రం

author img

By

Published : Aug 2, 2020, 2:43 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని తిమ్మాపురం గ్రామానికి సంబంధించిన పలు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు సర్పంచ్ నగేశ్ వినతి పత్రం అందించారు.

మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే సునీతకు సర్పంచ్ వినతిపత్రం
మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే సునీతకు సర్పంచ్ వినతిపత్రం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పరిధి తిమ్మాపురం రోడ్డు నుంచి బస్టాండ్ మీదుగా సబ్ స్టేషన్ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు సర్పంచ్ వినతి పత్రం అందించారు. ఆత్మకూరు మెయిన్ రోడ్ నుంచి హైస్కూల్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టంతో డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. మార్కెట్ యార్డు నుంచి కామునిగూడెం వరకు బీటీ రోడ్డు తక్షణమే నిర్మించాలని లేఖలో పేర్కొన్నట్లు సర్పంచ్ తెలిపారు. కామునిగూడెం నుంచి వయా సాగుబావి- మైసమ్మ మీదుగా భువనగిరి-మోత్కూర్ రోడ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

108 వాహనం సైతం...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనం సౌకర్యాన్ని సైతం కల్పించాలన్నారు. సర్పంచ్ జన్నాయి కోడే నగేశ్ శనివారం వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సునీత వెంటనే 108 వాహన సౌకర్యం కల్పిస్తామని, విడతల వారిగా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ నగేశ్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : రైతు నర్సింలు కుటుంబానికి వీహెచ్ ఆర్థిక సహాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.