యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో అన్ని గ్రామాల్లోలాగా ఇక్కడ కూడా రైతు వేదిక మంజూరైంది. సుమారుగా 22లక్షలతో రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం నుంచి 14లక్షలు మంజూరవ్వగా.. పని పూర్తయినా కూడా మిగతా 8 లక్షలు ఇంకా మంజూరవ్వలేదు. దీనితో 8 లక్షలు అప్పుగా తీసుకొచ్చి రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. అధికారులు త్వరగా పూర్తి చేయాలనడంతో అప్పు తెచ్చి మరీ నిర్మాణం పూర్తి చేశారు. రైతు వేదిక నిర్మాణం పూర్తిచేసినా... పెయింటింగ్ పనులు పూర్తికాలేదు.
రైతు వేదికకు రంగులు కూడా వేయాలనడంతో పెయింటర్ని సంప్రదించగా సుమారుగా 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుందన్నారు. అసలే రుణాలతో సతమతమవుతున్న సర్పంచ్ మల్లేశ్ పెయింటర్‌కి ఇచ్చే డబ్బులైనా మిగులుతాయనే ఆశతో స్వయంగా బ్రష్ పట్టి పని పూర్తిచేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేసి అప్పుల భారం నుంచి కాపాడాలని సర్పంచ్ మల్లేశ్ వేడుకుంటున్నారు.
చాలావరకు అప్పులు తెచ్చి పెట్టినా. పెయింట్‌కు కూడా నాలుగైదు వేలు అడుగుతున్నరు. టైమ్‌కు బిల్లులు రాక, దాంతో పాటు పెయింట్ వేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర లేవు. ఇక మన పని మనం చేసుకుందామనే ఉద్దేశంతో పెయింట్ వేస్తున్నా. ఇప్పటికే చాలా చోట్ల అప్పులు తీసుకొచ్చి పెట్టినా. చాలా వరకు అప్పులు ఇచ్చిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నరు. -రావుల మల్లేశ్, పెద్దపడిశాల సర్పంచ్
ఇదీ చదవండి: KTR: ఒకే చోట 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్ ట్వీట్