హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలుకాగా... వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగం తక్కువగా ఉన్నందున పెద్ద ప్రమాదం తప్పిందిని స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి:మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత