యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ స్పిన్నింగ్ మిల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను, కారు ఢీ కొట్టగా ఆటోలో ఉన్న నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో శుభకార్యానికి వెళ్తుండగా భువనగిరిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బండ రావిరాలకు చెందిన రాములు, లచ్చమ్మ, రాజయ్య, కృష్ణలు గాయపడ్డారు.
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.