తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 108 సిబ్బందికి ప్రతీ ఒక్కరికి 25 కేజీల బియ్యం అందించారు.
మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రమ్మ మెఘారెడ్డి పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కొరకై కృషి చేస్తున్న 108 సిబ్బంది సేవలు వెల కట్టలేనివని ఛైర్ పర్సన్ కొనియాడారు.