యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరి మున్సిపాలిటీ 17 వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతిమహేశ్ 180 మంది మున్సిపల్, శానిటేషన్ సిబ్బందికి ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారని వారి సేవను స్వాతిమహేశ్ కొనియాడారు. చెన్న స్వాతిమహేశ్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం