ఇతర రాష్ట్రాల నుంచి బతకడానికి తెలంగాణకు వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం కడుపున పెట్టుకొని కాపాడుకుటోందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్తో కలిసి చౌటుప్పల్లో వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు పంపిణీ చేశారు. కార్మికులకు వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జిల్లాకు వచ్చిన 21, 500 మంది వలస కూలీలకు బియ్యం, నగదు అందజేస్తామని కలెక్టర్ వివరించారు.
ఇదీ చదవండి: 'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'