కరోనా వైరస్ను నివారించడంలో పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మి నరసింహ రెడ్డి అన్నారు. భువనగిరి పురపాలకలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో తమ సొసైటీ ఆధ్వర్యంలో మైసూర్ శాండల్ సబ్బులు అందజేశారు.
తమ సిబ్బంది ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి పారిశుద్ధ్య నిర్వహణలో కృషి చేస్తున్నారని భువనగిరి మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ అన్నారు. ఒక్కొక్కరికి మూడు చొప్పున మైసూర్ శాండల్ సబ్బులను అందజేశామని రెడ్ క్రాస్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, పోలీస్ సిబ్బంది, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్