ETV Bharat / state

Yadadri Temple: రామలింగేశ్వర ఆలయానికి తుది మెరుగులు - Yadadri Darshanam

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి సకల సదుపాయాలతో అద్భుత పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. రెండున్నర ఎకరాల్లో పునర్​నిర్మితమైన స్వామి సన్నిధిలో.. భక్తి, ప్రకృతిని ప్రస్పుటించే శిల్ప రూపాలు కనువిందు గొలుపుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయం చెంతకు చేర్చిన స్పటిక లింగానికి.. శిల్పులు తుది మెరుగులు దిద్దుతున్నారు.

yadadri
yadadri
author img

By

Published : Jun 17, 2021, 9:23 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ప్రధాన, అనుబంధ ఆలయాల పునర్నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. నల్లరాతితో రూపొందించిన స్పటిక లింగం, నంది విగ్రహాన్ని కొండపైనున్న రామలింగేశ్వర స్వామి ఆలయం చెంతకు చేర్చారు. భక్తజనం.. భక్తి, శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మెట్ల మార్గంలో వాహనాల రాకపోకలకు దారి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు కాలి నడకన చేరుకొనే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లోరింగ్, రథశాల నిర్మాణం మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: JUSTICE NV RAMANA: రేపు శ్రీశైలం పర్యటనకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.