అయోధ్య రామమందిర నిర్మాణం భూమిపూజ నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి లేదని డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భువనగిరి పట్టణంలోని వివిధ సంఘాల నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
నిరంతరం నిఘా కొనసాగిస్తామని నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు, ఇన్‌స్పెక్టర్ సుధాకర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్