యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వలిగొండ మండలంలో జాలు కాల్వ, వర్కట్ పల్లి, గోకారం, నాతాళ్లగూడెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. వెల్వర్తి, వలిగొండ, అరూర్, సంగెం గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. బీబీనగర్ మండలంలో ఈదురు గాలులు వీచాయి.
భువనగిరి, పోచంపల్లి మండలాల పరిధిలో ఎలాంటి వర్ష ప్రభావం లేనప్పటికీ... మంగళవారం సాయంత్రం చాలా గ్రామాల్లో వాతావరణం చల్లబడింది. వర్షం కురిసే అవకాశం ఉండటంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచారు.
ఇదీ చదవండి: రెండు శరీరాలు, ఒకటే ఆత్మ.. వారే సీతారాములు!