ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చెరువులు, వాగులు పొంగుతున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనున్న లక్కారం, చౌటుప్పల్ చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
చౌటుప్పల్ కేంద్రంలో జాతీయ రహదారిపై గండి పడగా... ఎడమవైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వినాయక నగర్, శాంతినగర్, రాంనగర్ కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూదాన్ పోచంపల్లి- కొత్తగూడెం వెళ్లే మార్గంలో రోడ్డుపై నుంచి మూసీ ప్రవహించడం వల్ల ఓ ఆర్టీసీ బస్సు మూసీని దాటే ప్రయత్నం చేయగా ప్రమాదం జరగవచ్చని మధ్యలోనే ప్రయాణీకులను వెనక్కి పంపారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికుల్లో ఇద్దరు గల్లంతైనట్లు గుర్తించారు. వారిలో ఒకరి మృతదేహం లభించగా మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: మహిళపై కుప్పకూలిన పురాతన భవనం